రైతు కష్టం తెలిసిన వ్యక్తి కేసీఆర్.. అందుకే రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ అన్నారు .సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో రైతులకు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలను మంత్రి అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. “రైతుల సంక్షేమం కోసమే రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతుబంధు పథకం అమలు చేయాలన్నదే కేసీఆర్ ఆలోచన.వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నాం. సమయానికి ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తున్నాం.వ్యవసాయం దండగ కాదు.. పండుగలా మార్చుతున్న నాయకుడు సీఎం కేసీఆర్.మల్కపేట రిజర్వాయర్ ద్వారా కోనరావుపేటను సస్యశ్యామలం చేస్తాం.38లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం.వేములవాడ కు నాలుగేళ్లలో రూ.3300 కోట్లు కేటాయించాం .వేములవాడ గుడిని దక్షణ కాశీగా మార్చేందుకు రూ.400 కోట్లు కేటాయించాం.60 ఏండ్ల ల్లో కట్టిన గోడౌన్ల సామర్ధ్యం 4లక్షల మెట్రిక్ టన్నులే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 24 మెట్రిక్ టన్నుల సామర్ధ్యానికి పెంచా “మని అన్నారు.
Minister @KTRTRS addressing the farmers at #RythuBandhu program in Konaraopet, Rajanna Sircilla dist pic.twitter.com/1JlDdJekoB
— Min IT, Telangana (@MinIT_Telangana) May 13, 2018