జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లాలో బస్సుయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. బస్సు యాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై, అలాగే, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, ప్రాజెక్టుల్లో భారీ కుంభకోణాలపై విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పర్యటించి ఆ ప్రాంత ప్రజలకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అతి త్వరలో షాకింగ్ న్యూస్ చెప్పనున్నారట. ఇప్పుడు ఈ అంశమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ చెప్పనున్న ఆ షాకింగ్ న్యూస్ ఏమిటో తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో వదంతులు పుట్టుకొచ్చాయి. అవేమిటంటే. బీజేపీ, టీడీపీల నుంచి పవన్ కళ్యాణ్‌కు వేల కోట్ల రూపాయల రూపంలో ప్యాకేజీ అందిందని, తమ రెండు పార్టీల తరుపున ప్రచారం చేస్తే వేల కోట్ల రూపాయలను ముట్ట చెబుతామంటూ బీజేపీ, టీడీపీ కలిసి పవన్ కళ్యాణ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయంట. అంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, అవన్ని ఒట్టి పుకార్లేనని, ఆ రెండు పార్టీల నుంచి ఎటువంటి ప్యాకేజీ తాను తీసుకోలేదని మీడియా సమావేశం పెట్టిన ప్రతీ సారి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఇక అసలు విషయానికొస్తే.. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా పవన్ కళ్యాన్ రాజకీయాల నుంచి తప్పుకోనున్నారట. ఇప్పుడు ఈ అంశాన్నే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో బీజేపీ, టీడీపీల నుంచి వచ్చిన ప్యాకేజీ ద్వారా జనసేన పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఆ బడ్జెట్ కాస్తా ఖర్చైపోవడంతో డీలా పడ్డాడట. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కార్యక్రమాలను నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ స్పాన్సర్ల కోసం ఎదురు చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరో పక్క పార్టీకి సరైన కేడర్ లేకపోవడంతో పవన్ కళ్యాన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు సైతం జనసేనవైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో 2019 ఎన్నికల్లో పోటీ చేయాలా..? వద్దా..? అన్న మీమాంసలో పవన్ ఉన్నట్టు సమాచారం.
ఏదేమైనా 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీని గెలిపించేందుకు పవన్ కళ్యాణ్ చాలానే ఆసక్తి చూపించారని, అదే ఆసక్తిని త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలపై చూపించేందుకు పవన్ కళ్యాన్ విముఖత చూపుతుండటంతో జనసేన పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.