వరంగల్ లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామి ఇచ్చారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.
