వైసీపీ అధినేత జగన్ పాదయాత్రతో గతంలో కాపు ఉద్యమం సమయంలో తునిలో రైలు దగ్ధం కావడానికి చంద్రబాబే ప్రధాన కారకుడనే విషయం స్పష్టమవుతోంది. అందుకే ఘటన ఇన్నిరోజులైనా దోషులని శిక్షించలేదట. కాపు ఉద్యమాన్ని పక్కదారి పట్టించి శాంతిభద్రతల పేరుతొ ఉద్యమాన్ని అణచటానికి చంద్రబాబు వేసిన పక్కా స్కెచ్ గా అర్ధమవుతోంది. ఉండవల్లినుంచి చంద్రబాబు డైరెక్షన్ చేస్తే అదే రైలులో విజయవాడలో దేవినేని ఉమా మనుషులు, బోండా ఉమ గుండాలు ఎక్కారని, తర్వాత దెందులూరులో చింతమనేని గుండాలు వీళ్ళకి జతకలిశారని, వీళ్ళంతా రైల్ ఎక్కేటప్పుడే పెట్రోల్ క్యాన్లని వెంట తెచ్చుకొన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉద్యమంలో భాగంగా రైల్ రోకో చేయడానికి ఉద్యమకారులు వస్తారని తెలిసి ఈ ప్లాన్ వేసారట.. తుని దగ్గరకి రాగానే ట్రైన్లో ఉన్న గుండాలే రైలుని ఆపి ప్రయాణికులును దించి రైలుని తగలబెట్టారట. ఉద్యమకారులు రైలు పట్టాలపై వచ్చే సమయానికే రైలుకి నిప్పంటించటం జరిగింది . ఆతరువాత ఈ గుండాలే తుని పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి చేసారట. అయితే అధికార పార్టీ నాయకుల డైరక్షన్ లో తుని పోలీసులకు ముందే సమాచారం వచ్చవిన కారణంగా పోలీసులు ఎక్కడా కనీసం గాలిలోకి కూడా కాల్పులు జరపలేదు.. తర్వాత ఈ విషయం అర్ధమైంది. అయితే ఈ సంఘటన జరిగిన 10నిమిషాలకే మంత్రులు, చంద్రబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి పులివెందుల గుండాలే ఈ పని చేసారని చెప్పటం, తర్వాత స్థానికం వైస్సార్సీపీ కార్యకర్తలమీద, కాపుల మీద దొంగకేసులు పెట్టి ఉద్యమకారులుని భయబ్రాంతులుకి గురిచేసి ఉద్యమాన్ని అణిచేయాలని చూసారట. ఈ సంఘటనలన్నిటి వెనుక చంద్రబాబు ఉన్నాడని జగన్ ముందునుంచీ చెప్తూనే ఉన్నారు. కానీ అందరూ అది రాజకీయ విమర్శ అంటూ ప్రచారం చేసారు. కొంతమంది కాపు ఉద్యమకారులే రైలు తగలబెట్టారనుకున్నారు.. టీడీపీ మాత్రం వైసీపీ శ్రేణులపై ప్రచారం చేసింది. అయితే జగన్ తుని పర్యటనలో మాత్రం ప్రజలు వాస్తవాలను మరోసారి బహిర్గతం చేసారు. చంద్రబాబు ఆదేశాలతో అధికార పార్టీ నాయకులకు సంబంధిచినగూండాలే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని జగన్ పమక్షంలో కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేసారు.
