ఒడిశా సచివాలయం పేరును ఆరాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తాజాగా మార్చారు. ఇప్పటివరకూ సచివాలయ గా పిలుచుకున్న ఈ పేరును లోక్ సేవా భవన్ గా మార్చినట్టు ఆయన ప్రకటించారు. ఆయన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ ఒడిశా ప్రజలకు మరింత సేవ చేసేందుకు కష్టపడి అందరూ పని చేయాల్సిఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని, వారికి సేవచేయడానికే తామంతా ఎన్నుకోబడ్డామని వెల్లడించారు. ఈవిషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే సచివాలయ పేరు మార్చినట్టు తెలిపారు సీఎం నవీన్ పట్నాయక్.
