దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిన కేఫ్ కాఫీ డే అధినేత సిద్ధార్థ ఆత్మహత్య విషయంలో ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయి. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మంగళూరు వెళుతున్న సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఆయన ఫోన్‌లో అవతలి వ్యక్తులతో ఏం మాట్లాడారో ఆయన డ్రైవర్ బసవరాజ్ వెల్లడించారు. కారులో వెళుతుండగా 10 నుంచి 15 కాల్స్ చేసినట్లు డ్రైవర్ తెలిపారు. అవతలి వ్యక్తులకు సిద్ధార్థ పదేపదే క్షమాపణలు చెప్పారని వెల్లడించారు. సిద్ధార్థ భార్య మాళవిక మాట్లాడుతూ ఆయన ఉదయం ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పినపుడు, ఉదయం 11గంటలకు సమయంలో ఆఫీసు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నానని చెప్పినప్పుడు ఆయన ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదని ఎప్పటిలానే చాలా కూల్ గా ఉన్నారని, తనకు అనుమానం రాలేదని చెప్పారు. ఆయన ప్రకృతి ప్రేమికుడు కావడంతో తరచూ స్వగ్రామానికి వెళ్తుంటారని అలా వెళ్తున్నారని భావించానని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే సిద్దార్ధ చనిపోయారని తెలుసుకునే స్థితిలో ఆయన తండ్రి గంగయ్య లేరు. ఎందుకంటే ఆయన అనారోగ్య కారణంగా మైసూరు ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
