పాకిస్తాన్ వేదికగా పనిచేస్తున్న జైష్-ఎ-అహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్ లో విధ్వంసక చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ భారత ప్రధాని, అమిత్ షా మరియు అజిత్ డోభాల్ అని తెలుస్తుంది. ఈ ముగ్గురినే లక్ష్యంగా చేసుకొని పక్కా ప్రణాళిక సిద్దం చేసుకొని ఉరీ తరహాలో మరో విధ్వంసం సృష్టించినున్నారు. దేశమంతట పెద్ద నగరాల్లో కల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారని నిఘా వర్గాల సమాచారం రావడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తం అయ్యింది. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో జైష్-ఎ-అహ్మద్ సంస్థ కోపంతో రగిలిపోతుంది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలతోనే ఇదంతా చేయనున్నారు. ఈ మేరకు ఒక లెటర్ కూడా రావడం అందులో హెచ్చరింపు చర్యలు చేయడం ఇందులో 30నగరాలు, నాలుగు విమానాశ్రయాలు వారి టార్గెట్ అని తెలుస్తుంది. అందిన సమాచారం ప్రకారం ఈ 5రోజుల్లో ఏదైనా జరగవొచ్చు. దీనికోసం ప్రత్యేకంగా 10 గ్రూపులను సిద్దం చేసినట్టు సమాచారం.
