Home / Uncategorized / ఏబీ వెంకటేశ్వరరావు కుమారా.. మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే.. నిజాలు అబద్ధాలు కావు..!

ఏబీ వెంకటేశ్వరరావు కుమారా.. మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే.. నిజాలు అబద్ధాలు కావు..!

కేంద్ర రక్షణ శాఖ అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి క్రిటికల్‌ ఇంటెలిజెన్స్, సర్వైలన్స్‌ పరికరాలను కొనుగోలు చేయడంతో పాటు..దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్‌ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌ను విదేశీ కంపెనీలకు లీక్‌ చేసారనే ఆరోపణలతో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు, అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల ఫోన్‌ కాల్స్‌ను ట్యాపింగ్‌ చేయడానికి చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావులు 2017 లోనే ఓ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇజ్రాయెల్ కంపెనీ నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాల కొనుగోలు కాంట్రాక్టును చంద్రబాబు ఎటువంటి టెండర్లు లేకుండానే ఏబీవీ కుమారుడు చేతన్‌ సాయి కృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’అనే కంపెనీకి కట్టబెట్టారు. ఇందుకోసం విజయవాడ క్రీస్తురాజపురం ఫిల్మ్‌కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ అడ్రస్‌తో  ఓ షెల్  కంపెనీని నెలకొల్పారు.  ఇక ఈ కంపెనీ పేరిట కాంట్రాక్టు కట్టబెట్టడంలోనూ చంద్రబాబు, ఏబీవీలు నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా తనపై వస్తున్న ఆరోపణలపై ఏబీవీ కుమారుడు చేతన్ సాయి కృష్ణ స్పందిస్తూ.. ప్రెస్‌నోట్ విడుదల చేశారు. తాను ప్రభుత్వంతో కాని, ఏ ప్రభుత్వ శాఖతో కాని ఆంధ్రప్రదేశ్‌లో కాని లేక ఇతర ఏ రాష్ట్రంలో కానీ..ఏ రకమైన వ్యాపారం చేయలేదు. ఏ టెండర్‌లో పాల్గొనలేదు..నేను ఇప్పటి వరకు చేసింది ప్రైవేట్ సెక్టార్‌లోనే…నా తండ్రిని ఉపయోగించుకుని వ్యాపారం చెయ్యడం గానీ.. లాభం పొందడం గానీ చెయ్యలేదు.. నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో జరుగుతున్న విషప్రచారంపై సమాధానం చెప్పడానికి ఆయనుకున్న పరిమితులువల్ల నేనే ఈ విషయాలను వెల్లడించాల్సి వస్తుంది. రాజకీయ విష ప్రచార బాధితుడినైన నా పేరు బజారుకు లాగడం ఇకనైనా ఆపమని మనవి… లేని పక్షంలో పరువునష్టం దావా మినహా ఇంకొక మార్గం లేదంటూ…ఏబీవీ కుమారుడు తన ప్రెస్‌‌నోట్‌లో పేర్కొన్నారు.

కాగా చేతన్ సాయి ప్రెస్‌నోట్‌పై సోషల్ మీడియాలో నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. నాయనా… ఏబీ వెంకటేశ్వరరావు కుమారా.. ఏడు నెలల్లో 3 కంపెనీల్లో ఉద్యోగాలు మారిన గొప్ప టాలెంట్, హిస్టరీ ఉన్న నువ్వు సొంత కంపెనీ పెట్టి ఏదో సాధించాను అని చెప్పుకుంటే ఎవ్వరూ నమ్మరు.. ఒకవేళ నిజంగా మీరు అక్రమాలే చేయకపోతే… ఈ కాంట్రాక్టుకు ఉద్దేశించిన ‘పర్చేజ్‌ ఆర్డర్‌’ను రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం నుంచి మీ నాన్న ఉద్దేశ పూర్వకంగా ఎందుకు మాయం చేయించారని ప్రశ్నిస్తున్నారు. మీరు ప్రెస్‌నోట్ రిలీజ్ చేస్తేనో … మీ నాన్న ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకుంటేనో.. నిజాలు అబద్దాలు కాకుండా ఉండవు. విషయం లేకనే మీ నాన్న ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నాడని అందరికి తెలుసు…అయినా చంద్రబాబు కోసం వైసీపీ నేతల ఫోన్ ట్యాపింగ్‌కు చేసేందుకు రక్షణ శాఖ అనుమతి లేకుండా పరికరాలు కొనుగోలు చేసి, విదేశీ కంపెనీలతో దేశ భద్రతా రహస్యాలను చేరవేసి దేశద్రోహానికి పాల్పడిన మీకు, మీ నాన్నకు ముందుంది అసలైన ముసళ్ళ పండగ..అంటూ నెట్‌జన్లు కౌంటర్ ఇస్తున్నారు.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat