Home / NATIONAL / ఘోర రోడ్డు ప్రమాదం 24 మంది దుర‍్మరణం..30మందికి గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం 24 మంది దుర‍్మరణం..30మందికి గాయాలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో సుమారు 24 మంది దుర‍్మరణం చెందారు. తిరుపూర్‌ జిల్లా అవినాషి వద్ద KSRTC కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్‌ లారీ ఢీ కొనడటంతో 19మంది సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 30మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుప్పుర్‌, కోయంబత్తూరు ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సేలం జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు నేపాల్‌వాసులు మృతి చెందారు. ఓమలూరు వద్ద కారు, బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.