Home / 18+ / దక్షణాది రాష్ట్రాల్లో హై అలర్ట్..

దక్షణాది రాష్ట్రాల్లో హై అలర్ట్..

దక్షణాది రాష్ట్రాల్లో హై అలర్ట్ విధించారు.శ్రీలంక తరహా దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు బెంగుళూరు పోలీసులు వెల్లడించారు.దీనికి సంబంధించి 8రాష్ట్రాలకు లేఖలు పంపించారు.తమిళనాడులోని రామనాధపురంలో 19మంది ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందిందని..వారంతా దక్షణాది రాష్ట్రాలైన తమిళనాడు,కేరళ,కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పాండిచ్చేరి,గోవా,మహారాష్ట్రల్లో పలు ప్రధాన నగరాల్లో విద్వంశానికి దిగే అవకాశం ఉన్నట్లు లేఖలో వెల్లడించారు.ముఖ్యంగా ట్రైన్స్ లో కూడా పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తెలిపిన కన్నడ పోలీసులు ఏ క్షణమైనా దాడులు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ప్రతిచోట తనిఖీలు చెయ్యాలని సూచించారు.ఇది ఇలా ఉండగా నిన్న రాత్రి శ్రీలంకలో మరోసారి ఉగ్రవాదులు బాంబులు పేల్చారు.దీంతో అలెర్ట్ ఐన సైన్యం ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించారు.సైన్యం ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి.