Home / Uncategorized / ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా నల్గొండలో కొవ్వొత్తి ర్యాలీ

ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా నల్గొండలో కొవ్వొత్తి ర్యాలీ

ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నర్సుల సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా శనివారం కొవ్వొత్తి ర్యాలీని నల్గొండ లో నిర్వహించారు* కొనేదెటి మల్లయ్య ఫౌండర్ చైర్మన్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు. శాంతి నగర్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుండి క్లాక్ టవర్ వరకు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. కొనేదెటి మల్లయ్య గారు మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి చాలా అభివృద్ధి చెందినప్పటికీ గ్రామాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కొరత ఉంది .. అందువల్ల ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నర్సింగ్‌పై అవగాహన తీసుకురావాలి అలాగే నర్సింగ్ అంటే సమాజానికి సేవ చేసే వృత్తి కాబట్టి మనం ఇతర వృత్తులతో పోల్చినప్పుడు నర్సింగ్ వృత్తి సేవ దృక్పథంతో కూడుకున్నది కావున నర్సింగ్ విద్య, ఉపాధి విషయంలో కూడా ప్రభుత్వం సహకరించాలి ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల మాదిరిగానే మెస్ ఫీజు పొందాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 ను నర్సు మరియు మిడ్ వైఫ్ సంవత్సరంగా ప్రకటించడం నర్సింగ్ వృత్తికి దక్కిన గౌరవంగా భావిస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ మాట్లాడుతూ 2020 నర్సుల సంవత్సరంను నర్సుల సంవత్సరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది.

రోగులకు ఆరోగ్య సేవలను అందించడంలో నర్సులు కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. అందువల్ల నర్సింగ్, మిడ్‌వైఫరీ వర్క్‌ఫోర్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించగలమని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పింది ఆయన అన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని 2020 సంవత్సరాన్ని “నర్సు మరియు మిడ్వైఫరీ సంవత్సరంగా” ప్రకటించినట్లు మనకు తెలుసు. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ సేవలను గుర్తిస్తూ వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి అని ఆయన అన్నారు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు ప్రకారం ప్రవేట్ ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్ నర్సెస్ కు కనీస వేతనo 20,000/-ఇవ్వాలి అనే చట్టంను అమలు చేయాలి మన రాష్ట్రములో జెండర్ తో సంబంధ లేకుండా మేల్ నర్సెస్ కూడ ఫిమేల్ నర్సెస్ తో పాటు సమానంగా ఉద్యోగ మరియు ఉన్నత విద్య కు అవకాశాలు కలిపించాలి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలి.అలాగే కాంట్రాక్టు నర్సింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి.ఉన్నవారిని రెగ్యులరైజ్ చేయాలి ప్రభుత్వ మరియు ప్రేవేటు ఆసుపత్రిలలో పని చేసే ప్రతి నర్సింగ్ ఆఫీసర్ కు ఉద్యోగ మరియు ఆరోగ్య భద్రతా కల్పించాలి రాష్ట్రంలో నర్సింగ్ డైరెక్టర్ ను ఏర్పాటు చేయాలి రాష్ట్రములోచదువుతున్న ప్రతి నర్సింగ్ విద్యార్ధి కి 2017 సంవత్సరం నుoడి కాలేజీ ఫీజు పెంచిన విధము గానే నర్సింగ్ విద్యార్ధులకు స్కాలర్ షిప్స్ మరియ స్టెపంఢ్ వెంటనే పెంచాలి .

నర్సింగ్ కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి కేంద్ర సర్కారు సవరించిన హోదాను స్టాఫ్ నర్సు నుంచి నర్సింగ్ అధికారిగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ ఉత్తర్వులను నేటి వరకు ఎందుకు అమలు చేయడం లేదు.. ఈ ఉత్తర్వులను అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద నయా పైసా ఖర్చు ఉండదు..అయినా అమలు చేయడం లేదు తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ , మరియు దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్లగొండ నర్సింగ్ విద్యార్థులు కలసి కొవ్వొత్తి మార్చ్ ను నిర్వహించారు ఈ మార్చ్ శాంతి నగర్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుండి క్లాక్ టవర్ వరకు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. క్లాక్ టవర్ చేరుకొని అక్కడే ఈ కొవ్వొత్తి మార్చ్ ముగిసింది ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీను రాథోడ్ ముఖ్య సలహాదారులు చీలుపురి వీరాచారి గారు డాక్టర్ చెరుకూరి రామ్ తిలక్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్, వైస్ ప్రెసిడెంట్ కవిత గారు కోశాధికారి వంశీ ప్రసాద్. దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ వనజ రెడ్డి, పాండు గారు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ దీప్తి కాలేజ్ మరియు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat