Home / NATIONAL / సామాన్యుడి ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం..!

సామాన్యుడి ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం..!

నేడు దేశ రాజధాని ఢిల్లీలో పండుగ వాతావరణం అని చెప్పాలి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నేడు ఢిల్లీలో రామ్‌లీలా మైదానం వేదికగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి వేలాదిమంది హాజరయ్యారు. పార్టీ ప్రతినిధులకు మద్దతు ఇవ్వడానికి పార్టీ జెండాలు, పోస్టర్లు మరియు ప్లకార్డులతో మైదానం అలంకరించారు. ఆప్ టోపీ ధరించి ప్రజలు కేజ్రీవాల్ కోసం ఉత్సాహంగా ఉన్నారు. వెలువడిన ఎన్నికలమ్ ఫలితాల్లో ఆప్ 62సీట్లు గెలుచుకోగా బీజేపీ కి 8 వదిలేసింది. ఈ ఈవెంట్ కు పీఎం తో సహా ఆ పార్టీ లో గెలిచిన 8మంది సభ్యులను ఆహ్వానించారు. కాని మోదీ వారణాసి వెళ్ళాల్సి ఉండడంతో ఆయన రారు అని తెలుస్తుంది.