Home / Uncategorized / తెలంగాణలో కరోనాతో ముగ్గురు మృతి

తెలంగాణలో కరోనాతో ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ బారీన పడిన వారు మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.బుధవారం కరోనా వైరస్ బారీన పడినవారిలో ముగ్గురు మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

వీరిలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు చనిపోగా..యశోద ఆసుపత్రిలో ఒకరు చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది.

ఈ మూడు మరణాలతో కలిపి ఇప్పటివరకు కరోనా వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.నిన్న బుధవారం ఒక్క రోజే ముప్పై పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఈ ముప్పైతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 127కేసులు నమోదయ్యాయి.