సాధారణంగా మనం వాట్స్అప్ నుండి ఎవరికైనా సందేశం పంపినప్పుడు సింగిల్ టిక్ వస్తుంది.ఆ సందేశం అవతలి వారి మొబైల్ కు చేరగానే రెండు టిక్స్ వస్తాయి.ఆ సందేశాన్ని అవతలి వారు చూడగానే రెండు బ్లూ కలర్ లో కనిపిస్తాయి. కొన్ని సమయాల్లో ఆ సందేశాన్ని చూసి తిరిగి సమాచారం ఇవ్వకపోతే అవతలి వ్యక్తి విసుక్కునే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలను దూరం చేసేందుకు వెళ్లి సెట్టింగ్స్ లో అకౌంట్ లోనికి వెళ్లి అక్కడ ప్రైవసీ కి వెళ్లి రీడ్ స్క్రిప్టు ను ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఈ బ్లూ కలర్ టిక్స్ రావు. కానీ ఇతరులకు సందేశాన్ని ఎవరు చూశారో తెలుసుకోవచ్చు.
అలాగే గ్రూప్స్ లో వచ్చే అనవసర ఇమేజెస్ వీడియోస్ ఆటోమాటిక్ గా డౌన్ లోడ్ అవడం వలన డాటా కూడా ఎక్కువ ఖర్చవుతుంది.దీన్ని తగ్గించేందుకు యాప్ లోని సెట్టింగ్స్ లో డాటా యూసేజ్ పై క్లిక్ చేస్తే ఏమి డౌన్ లోడ్ చేయాలో ఏవి చేయొద్దో అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిద్వారా డాటా వినియోగం తగ్గించుకోవచ్చు. అలాగే స్పేస్ ను తగ్గించుకోవచ్చు.మామూలుగా సందేశాలను పెద్ద చిన్న అక్షరాలలో మాత్రమే పంపుతుంటరు అయితే వివిద స్టైల్స్ లలో కూడా పంపించుకోవచ్చు.
అలాగే gmail లో ముఖ్యమైన సందేశాన్ని ఎలాగైతే స్టార్ గుర్తుతో మార్క్ చేసుకుంటామో అలాగే వాట్స్ ఆప్ లో కూడా స్టార్ మార్క్ చేసుకోవచ్చు.ఆ ముఖ్యమైన సందేశాన్ని లాంగ్ మార్క్ ప్రెస్ చేసి పట్టుకుంటే తిరిగి ఆ సందేశాన్ని మైన్ మెనూ లో స్టర్రెడ్ సందేశాల్లో చూసుకోవచ్చు. సందేశానికి రిప్లై ఇవ్వదలచుకొనప్పుడు దాన్ని అన్ రీడ్ గా మార్చుకోవచ్చు.దీనికోసం ఆ సందేశంపై లాంగ్ ప్రెస్ చేసి మార్క్ ఆల్ అన్ రీడ్ పై క్లిక్ చేయాలి.అలాగే వాట్స్ ఆప్ ను డెస్క్ టాప్ పై వెబ్ వాట్స్ ఆప్ ను డౌన్ లోడ్ చేసుకొని డెస్క్ టాప్ ను ఫోన్ కు అనుసంధానం చేసి పదే పదే మొబైల్ తీయకుండా డెస్క్ టాప్ లో మే సందేశాలను పంపుకోవచ్చు.ఇది ఉద్యోగులకు మంచిగా పని చేస్తుంది.