దేశంలో ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు పెరిగి పోతున్నాయి. పెళ్లికాని వారు..పెళ్లి అయిన వారు..సాదరణ వ్యక్తులు..ఉద్యోగస్తులు..మరి నీచంగా పోలీసులు కూడ అక్రమ సంబంధాలతో అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా ఇద్దరు పోలీసు అధికారుల మధ్య ఉన్న అక్రమ సంబంధం బట్టబయలైంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో జరిగింది. తన భార్యతో కల్వకుర్తి సీఐ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. అవినీతి వ్యతిరేక విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తున్న అధికారిణి భర్త, తన బంధువులతో కలిసి సీఐపై దాడికి పాల్పడ్డాడు. ఓ ఇంట్లో తన భార్యను, సీఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆయన.. నడిరోడ్డుపై సీఐని చితక్కొట్టాడు. ఏఎస్పీ తల్లి, అత్త.. ఆ సీఐని చెప్పులతో కొట్టారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఏఎస్పీ, సీఐల వైఖరిపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తన భార్యను సీఐ ట్రాప్ చేశాడని, గత రెండేళ్లుగా వారి మధ్య సంబంధం ఉందని ఏఎస్పీ భర్త ఆరోపించాడు. భార్య బాగోతం బయటపెట్టాలనే.. తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, అయితే తన భార్య బాగోతం బయటపెట్టాలనే ఉద్దేశంతోనే వారిని పట్టుకున్నానని ఆయన తెలిపారు.
