దేశంలో ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు వీపరీతంగా జరుగుతున్నాయి. మగవారే అనుకుంటే ఆడవారు కూడ ఈ మద్య అక్రమ సంబంధాలు ఎక్కువగా కొనసాగిస్తున్నారు. తాజాగా భర్త డ్యూటీపై వెళ్లగానే భార్య మరో వ్యక్తితో గుట్టుగా అక్రమ సంబంధం సాగిస్తోన్న రాసలీలలు భర్త అమర్చిన రహస్య సీసీటీవీ ఫుటేజ్ లో వెలుగుచూశాయి. ఈ ఘటన మహారాష్ట్ర పూణే నగరంలోని అంబేగామ్ ప్రాంతంలో జరిగింది. పూణే నగరానికి చెందిన ఓ యువకుడు ఓ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 2007 మార్చిలో ఓ యువతితో హిందూ సంప్రదాయం ప్రకారం అతడికి వివాహమైంది. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే అతడికి తన భార్య వ్యవహారశైలిపై అనుమానం వచ్చింది. ఇదిలా ఉండగా, అతడి భార్య ఓ రోజు ఇంటి నుంచి పారిపోయి మూడురోజుల తర్వాత తిరిగివచ్చింది. తాను పాఠశాలకు వెళ్లిన తర్వాత రోజూ తమ ఇంటికి మరో వ్యక్తి వస్తున్నాడని తన కుమారుడి మాటల ద్వారా గ్రహించిన భర్త తన భార్య ఆటకట్టించాలని నిశ్చయించుకున్నాడు.
see also..జగన్‌పై కేసులు కుట్రపూరితమే.. తేల్చి చెప్పిన సుప్రీం న్యాయవాది..!!
భార్యకు తెలియకుండా ఇంట్లోని అన్ని గదుల్లో రహస్యంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించాడు. ఓరోజు పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చినతరువాత ఆ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన భర్తకు దిమ్మతిరిగిపోయింది. అతడి భార్య మరో వ్యక్తితో సాగిస్తున్న రాసలీలలు వాటిలో రికార్డయి ఉన్నాయి. దీంతో అతడు కోర్టుకెక్కాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూపుతూ తనను మోసగించి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య నుంచి విడాకులు కోరాడు. అయితే అతడి భార్య మాత్రం తనకు విడాకులు ఇస్తే ఆత్మహత్య చేసుకుంటానంది. తనకు మనోవర్తి ఇవ్వాలని, లేదంటే గృహహింస చట్టం కింద తాను కేసు పెడతానని భార్య బెదిరించింది. దీంతో ఆమె భర్త తన వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యంతో కోర్టును ఆశ్రయించాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన కోర్టు భార్య ఫిర్యాదును తోసిపుచ్చింది. భర్తకు విడాకులు మంజూరు చేయడమేకాకుండా.. భార్యతోపాటు ఆమె ప్రియుడిపై కూడా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
see also. .వైసీపీలోకి 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ మాజీ మంత్రి …!