కర్నూలు జిల్లాలో అత్యంత దారుణంగా నేరాలు జరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు , దోపిడిలు ,అక్రమ సంబంధాలు ఇలా నేరాలు ఎన్ని రకాలు ఉంటే అన్ని కర్నూల్ జిల్లాలో జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తిని పొలాల్లోకి తీసుకుని వెళ్లి కత్తి మర్మాంగాలు కోసి మంటల్లో కాల్చి హత్య చేశారు. కర్నూలు జిల్లా డొంగుదారి పొలాల్ల ఓ వ్యక్తిని కాల్చి చంపిన విషయాన్ని స్థానికులు నందివర్గం పోలీసులకు శుక్రవారం ఉదయం సమాచారం అందించారు. పాణ్యం సిఐ పార్థసారథి రెడ్డి, నందివర్గం ఎస్ఐ శంకరయ్య పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశించారు.
see also..పక్క రాష్ట్ర సీఎం సంచలన కామెంట్…చూసి నేర్చుకో బాబు
వ్యక్తిని మర్మాంగాలు కోసి, శనగకర్ర వేసి పెట్రోలు పోసి తగులబెట్టిన ఆనవాళ్లు పోలీసులకు కనిపించాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అతను తమ విఠలాపురం గ్రామవాసి అని, చెన్నయ్య కుమారుడు మాల కొప్పెర పెద్ద చెన్నయ్య (35) అని చెప్పారు. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు సంఘటనా స్థలానికి కర్నూలు నుంచి క్లూస్ టీమ్‌ను, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. పెద్ద చెన్నయ్య హత్యకు వివాహేతర సంబందమే కారణమా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పార్థసారథి చెప్పారు. చెన్నయ్యకు నంద్యాల మండలం బల్లలాపురం గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. వారి కూతురు 9వ తరగతి చదువుతోంది. చెన్నయ్యకు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండేదని, దానిపై పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగిందని అంటున్నారు.
see also..ధమాకా న్యూస్.. వైసీపీలోకి టీడీపీ ఎంపీ.?
దాంతో నాలుగేళ్లుగా చెన్నయ్య దంపతులు గ్రామానికి దూరంగా ఉన్నారు. ఏడాది క్రితం చెన్నయ్య దంపతులు విఠలాపురం గ్రామానికి తిరిగి వచ్చారు. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద చెన్నయ్యను హత్య చేశారు. ఆ అక్రమ సంబంధం కారణంగానే హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.