స్కూల్ విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్ధాల్సిన ఉపాధ్యాయుడే ఆడ పిల్లలకు ప్రేమ ఉత్తరాలు రాస్తూ ఉంటే ఇంత కన్న దారుణం ఇంకొక్కటి ఉంటుందా. ఎన్నో కలలతో , సాదించలనే పట్టుదలతో అమ్మాయిలు ముందుకు వచ్చి చదువుకుంటూ ఉంటే..ఈలాంటి కామాంధుల వల్ల ఎందరో మద్యలోనే చదువు ఆపేస్తున్నారు. తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదే ఆలాంటి స్థానంలో ఉండి ఇంత నీచానికి దిగజారండం నిజంగా సిగ్గుచేటు. అసలేం జరిగిందంటే కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యా యుడు విజయ్‌కుమార్ అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి గత కొంత కాలంగా లవ్ లెటర్స్ రాస్తూ వేధిస్తున్నా డు. గ్రామస్థులకు ఈ విషయం తెలియడంతో పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడిని గదిలో నిర్భంధించి చితక బాదారు. గతంలో పలుమార్లు పాఠశాలలో సమావేశం నిర్వహించి వార్నింగ్ ఇచ్చినప్పటికీ తన బుద్ధి మార్చుకోకుండా మళ్లీ మళ్లీ లవ్ లెటర్స్ రా స్తూనే ఉన్నాడు. గురువారం పాఠశాల పనిదినం చివరి రోజు కావడంతో గ్రామస్థులందరూ ఏకమై ఉపాధ్యా యుడు రాగానే చితకబాదారు.
అనంతరం గదిలో నిర్భంధించి జి ల్లా మండల విద్యాశా ఖాధికారి, పోలీసులకు సమాచారం అందజే శారు. ఉపాధ్యాయుని చేత గ్రామస్థులు రాజీనామా ఉత్తరం రాయించుకున్నారు. ఈ విష యాన్ని ఎంఈవో డీఈవోకు సమాచారం ఇవ్వడంతో ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ఫోన్‌లోనే గ్రామస్థులకు తెలిపా రు. ఉపాధ్యాయుడిని పోలీసులకు అప్పగించగా, మద్నూర్ ఎస్సై సాజిద్ అరెస్టు చేసి పోలీ స్ స్టేషన్‌కు తరలించారు. కాగా సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్టు డీఈవో ఉత్త ర్వులు జారీ చేశారు.