కేఫ్ కాఫీ డే ఫౌండర్, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ రెండురోజులుగా కనిపించకుండా పోయిన ఆయన నేత్రావతి నదిలో దూకినట్లు అక్కడి స్థానికులు చెప్పారు. రెండురోజుల నుంచి గజఈతగాళ్లు వెతకడంతో ఇవాళ ఆయన మృతదేహం లభ్యం అయ్యింది. ఈ నెల29 న నేత్రావది నది ఒడ్డున డ్రైవర్ తో కారులో వచ్చిన ఆయన కారు ఆపిదిగాడు. డ్రైవర్ కారులోనే ఉండగా.. ఎంత సేపైనా సిద్ధార్థ రాకపోవడంతో డ్రైవర్ కాసేపు వెతికి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు డ్రైవర్.. తర్వాత వారు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు మంగళవారం నుంచి బృందాలుగు వెతకడం మొదలు పెట్టారు.
నదిలో దూకినట్లు ఒక జాలరి చెప్పడంతో గజ ఈతగాళ్లు నిన్నటి నుంచి గాలించగా సిద్ధార్థ ఆత్మహత్యచేసుకునే ముందు రెండు రోజుల క్రితం సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు లెటర్ రాసినట్లు తెలిసింది. తాను ఓ వ్యాపార వేత్తగా విఫలమయ్యాయని, ఎవర్నీ మోసం చేయలేదని తెలిపారు. తాను ఓత్తిడి భరించలేకపోతున్నానని, అందరు క్షమించాలని కోరుతున్నా లేఖలో రాశారు. సిద్ధార్థ 1990లో కేఫ్ కాఫీ డేను ప్రారంభించి తక్కువ కాలంలోనే కేఫ్ కాఫీ డేను ఇంటర్నేషనల్ బ్రాండ్ గా తీర్చిదిద్దారు. వేలమందికి ఉపాధినిస్తున్నారు. ఆయన కేవలం మోసం చేయడం రాకే చనిపోయాడంటూ సన్నిహితులు వాపోతున్నారు.