జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ పునర్విభజనకు బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 351 ఓట్లు, వ్యతిరేకంగా 72 ఓట్లు వచ్చాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు ఆమోదముద్ర వేశారు. అంతకుముందు అమిత్ షా బిల్లులోని అంశాలను సభ్యులకు కూలంకషంగా వివరించారు.
