బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. అరుణ్ జైట్లీ మంచితనానికి మారుపేరు అని చెప్పాలి. ఎందుకంటే ఎంతో మందికి ఆయన సహాయం చేసారు. దీనికి మంచి ఉదాహరణ ఇదే.ఎలాంటి వ్యక్తి ఐన ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే డబ్బు పెట్టాలి, మనుషులను పోగు చేసుకోవాలి అలా చెయ్యకుంటే ఎన్నికల్లో గెలవడం కష్టమే. ఇక జైట్లీ విషయానికి వస్తే అప్పుడు ఎన్నికల సమయం. జైట్లీ అమృత్సర్ నుండి పోటీకి దిగారు. ఆ విషయం తెలుసుకున్న జైట్లీ బంధువులు, మిత్రులు సైతం తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో దాదాపు 40 తాత్కాలిక కార్యాలయాలు పెట్టి ఆయనకు అండగా నిలిచారు. వీరిలో అందరూ ఇంజినీర్లు మరియు డాక్టర్లే ఉన్నారు. వీళ్ళు మరెవ్వరో కాదు అరుణ్ జైట్లీ అండతో చదువుకొని ఈ స్థాయికి వచ్చినవారే.వీరంతా కూడా అతనిని మంచి మనసున్న వ్యక్తిగా పెర్కున్నారు.
