అడ్డమైన తిరుగుళ్లు వద్దన్న తల్లిని చంపి ఇద్దరు ప్రియుళ్లతో శృంగారంలో మునిగిన కసాయి కూతురు కేసు కొత్త మలుపు తిరిగింది. బాలరెడ్డి అనే యువకుడిని ప్రేమించిన కీర్తిని అతడికిచ్చి పెళ్లి చేయాలన్న నిర్ణయం జరిగింది. అయితే వేరొకడితో శృంగారం నెరపడంతో నెల తప్పి కడుపు తెచ్చుకుంది. దీంతో శరత్ అనే మరో యువకుడిని అబార్షన్ కోసం సాయం కోరింది. తరువాత అతడితో ప్రేమ వ్యవహారం నడిపింది. ఈ విషయాలు తెలిసి తల్లి మందలిస్తే శరత్ తో కలిసి తల్లిని చంపేసింది. తల్లి నిద్రలో ఉండగా శరత్ కాళ్ళు పట్టుకోగా ,కీర్తి తల్లి గొంతుకు ఉరి బిగించి చంపింది. మూడు రోజులు శరత్ తో ఇంట్లోనే శృంగారంలో మునిగి తేలింది. శవం వాసన రావడంతో ఇద్దరూ కలిసి రైల్వే ట్రాక్ పై పడేసారు. తరువాత తనకు పెళ్లి కుదిరిన బాల్ రెడ్డి తండ్రికి ఫోన్ చేసి తల్లి రజిత మాట్లాడినట్టు గొంతు మార్చి మాట్లాడింది. కూతురు కీర్తిని మూడు రోజులు మీఇంట్లో ఉంచుకొండని చెప్పింది. అలా కీర్తి బాల్ రెడ్డి ఇంటికి వెళ్లి అక్కడ సరసం మొదలెట్టింది. తండ్రి వచ్చాక అమ్మ ఎక్కడని అడిగితే , తాగి నువ్వే చంపేసి ఉంటావని బుకాయించి పోలీసులకు చిక్కి పోయింది.
