గత సంవసత్సరం ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార ఘటన యావత్ దేశాన్ని తలచివేసింది.ఈ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందింది. గతేడాది డిసెంబర్‌లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, కేసు విచారణ నిమిత్తం గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు.
90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు తుదిశ్వాస వదిలిందని వైద్యులు తెలిపారు. కాలిన గాయాలతో బాధితురాలు కేకలు వేసుకుంటూ జీవించాలన్న ఆశతో కిలోమీటరు వరకు పరుగులు పెట్టింది. అనంతరం దగ్గరలోని వ్యక్తులు ఆమెను లక్నోలో ఓ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే మరణించింది. చనిపోయే ముందు బాధితురాలు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటుకు ఆజ్ఞలు జారీ చేసింది.
అత్యాచార బాధితురాలిని సజీవంగా తగలపెట్టేందుకు ప్రయత్నించిన ఘటనపై శుక్రవారం లోక్‌సభ అట్టుడికింది. చర్చ సందర్భంగా పలువురు సభ్యులు హైదరాబాద్‌లో దిశ హత్యాచార నిందితుల ఆఘాతుకం జరిగిన 9 రోజులలోనే నింధితులను ఎన్‌కౌంటర్ చేసిన తీరును ప్రస్తావించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉన్నావ్ బాధితురాలి కేసును ప్రసంగిస్తున్న సమయంలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు.. ఆమెను బెదిరిస్తున్న తీరులో వ్యవహరించడంపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. జీరో అవర్‌లో ఉన్నావ్ ఘటనను లేవనెత్తిన కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి చేసిన ఒక వ్యాఖ్య బీజేపీ సభ్యులకు ఆగ్రహం తెప్పించింది.
‘ఒకవైపు రామ మందిర నిర్మాణ ఏర్పాట్లు జరుగుతుంటే.. మరోవైపు సీతమ్మలను తగలబెడ్తున్నారు’ అని చౌధురి వ్యాఖ్యానించారు. ఉత్తర పదేశ్ చట్టాలు అమలుకాని అధర్మ ప్రదేశ్‌గా మారిందన్నారు. దీనిపై హోం మంత్రి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్, ఉన్నావ్ ఘటనలను పోలుస్తూ.. ‘నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసి తగిన న్యాయం చేసారని కానీ ఉన్నావ్ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు నింధితులను వదిలేశారని వ్యాఖ్యానించారు. దేశంలో ఎలాంటి ఘాతుకాలు పునరావృతం కాకుండా ఉండాలంటే శిక్షలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు.