అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో సతీసమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చారు. ట్రంప్ 36 గంటల భారత పర్యటనలో ముందుగా సభర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుండి ఆశ్రమానికి వెళ్ళే దారిపొడుగునా ట్రంప్ కు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఆశ్రమం తరువాత నేరుగా స్టేడియం కు వెళ్లనున్నారు. స్టేడియం కు వెళ్ళే దారిలో లక్షల మంది ట్రంప్ కు స్వాగతం పలకనున్నారు.
