బ్రేకింగ్ న్యూస్..భారత్ లో కరోనా సోకడంతో మరో వ్యక్తి మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షల కేసులు నమోదు అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఇండియా పరంగా చూస్కుంటే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం 130కేసులు వరకు నమోదు అయినట్టు తెలుస్తుంది. మరోపక్క ఇప్పటికే బెంగళూరులో ఒకరు, ఢిల్లీలో ఒకరు మరణించారు. అయితే తాజాగా ఇప్పుడు ముంబైలో 64ఏళ్ల వయసు గల వ్యక్తి మరణించాడు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. అయితే ఈ వ్యక్తి కరోనా కాకుండా ఇంకా ఎన్నో వ్యాదులతో మరణించాడని అధికారులు చెబుతున్నారు.
