Home / Uncategorized / హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా కేశవరావు, పేదలకు అందించిన న్యాయ సేవలను సీఎం స్మరించుకున్నారు.

కేశవరావు కుటుంబ సభ్యులకు సీఎం  కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని, సీఎస్ సోమేశ్ కుమార్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.