ప్రేమ వాహనాన్ని సవారీ చేసి ప్రతి ఒక్కరూ చేరుకోవడానికి తహతహలాడే డెడ్ ఎండ్‌నే పెళ్లి అంటారు.ప్రేమలో మోహం ఉంటుంది. ఆకర్షణ ఉంటుంది. కోరిక ఉంటుంది. హక్కు ఉంటుంది. పై చేయి ఉంటుంది. దబాయింపు ఉంటుంది. సంజాయిషీ ఉంటుంది. పెత్తనం ఉంటుంది. పగ కూడ ఉంటుంది. అయితే తాజాగా జరగిన సంఘటన చూస్తే.ఇద్దరు యువకులు ప్రాణమిత్రులు కావడము, అటుపై వారిద్దరూ ఒకే అమ్మాయినే ప్రేమించడము, చివరకు ఆమె కోసం చంపడం జరిగింది. అచ్చం 1996 లో విడుదలైన తెలుగు సినిమా ‘ ప్రేమ దేశం కథను తలపించింది. వేరు వేరు కళాశాలల్లో చదివే ఇద్దరు యువకులు బద్ద శతృత్వం వదిలి ప్రాణమిత్రులు కావడము, అటుపై వారిద్దరూ తమ స్నేహితురాలినే ప్రేమించడము, చివరకు ఆమె ఎవరిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకొన్నది అన్నదే ప్రేమదేశం సినిమా కథ..కాని తాజాగా జరిగిన సంఘటన సినిమాలాగే ఉన్నా.. దీనిలో హత్య అనేది ఉంది..వివరాలు చూద్దాం…ప్రేమికుల రోజు నాడే ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇద్దరు మిత్రులు గొడవపడి కత్తితో పొడవడంతో ఒకరి ప్రాణం పోయింది. ఈ సంఘటన దొడ్డబళ్లాపురం తాలూకాలోని కంచిగనాళ గ్రామంలో చోటుచేసుకుంది. కంచిగనాళ గ్రామం నివాసులయిన సంతోష్ (24), హరీష్ (24) చిన్నప్పటి నుండి ఆప్త స్నేహితులు. సంతోష్ వ్యవసాయం చేసుకుంటుండగా, హరీష్ చదువు సగంలో వదిలేసి షేర్ ఆటో డ్రైవర్‌గా ఉన్నాడు. ఇలా ఉండగా ఏడాది కాలంగా హరీష్, ఇదే గ్రామానికి చెందిన ఒక యువతి పరస్పరం ప్రేమించుకున్నారు. ఇదే సమయంలో ఆ యువతి తమ కులం అమ్మాయి కావడంతో సంతోష్ కూడా ఇష్టపడి ప్రేమించడం ప్రారంభించాడు. ఈ విషయంలో స్నేహితులు కొంతకాలంగా శత్రువులుగా మారారు.
see also..”పవన్ కళ్యాణ్ – చంద్రబాబు ప్యాకేజీ” బాగోతాన్ని ఆధారాలతో సహా రట్టు చేసిన టీడీపీ ఎంపీ..!!
తరచూ అమ్మాయి ప్రేమ కోసం కొట్టుకున్నారు. ఈ క్రమంలో గత వారం అమ్మాయికి హరీష్ ఆటోలో అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడట. ఈ విషయం తెలుసుకున్న సంతోష్ హరీష్‌తో ఘర్షణపడి బెదిరించాడు. ఈ విషయమై హరీష్ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ కోసం గ్రామానికి వచ్చి సంతోష్ ఇంటికి వెళ్లారు. దీనిని అవమానంగా భావించిన సంతోష్ మంగళవారం రాత్రి గ్రామంలోని అశ్వత్థకట్ట వద్ద హరీష్‌తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే సంతోష్ కత్తితో హరీష్ గొంతు, ఎద భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితున్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. సంతోష్ పరారయ్యాడు.
seealso..సోనియానే ఎదురించిన ధీరుడు వైయస్ జగన్…నరేంద్రమోడీ అంటే చంద్రబాబుకు భయం
అయితే నేడు అనగా(గురువారం) మృతుని తల్లితండ్రులు హరీష్‌కు సంబంధించిన వస్తువులు పరిశీలించగా కొన్ని లవ్ లెటర్లు లభించాయి. అవన్నీ హరీష్ ప్రేమిస్తున్న అమ్మాయి రాసినవే. ఆమె ఇద్దరు యువకులతోనూ ప్రేమ సాగిస్తోందని తేలింది. ముఖ్యంగా అమ్మాయి హరీష్ వల్ల గర్భవతి అయిన సంగతి తెలిసింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులే సంతోష్‌ను ఉసిగొల్పి తమ కొడుకును హత్య చేయించారని హరీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తక్కువ కులానికి చెందిన తమ కుమారుడికి అమ్మాయినిచ్చి వివాహం చేయడం ఇష్టంలేకే హత్య చేయించారని చెబుతున్నారు.