దేశ వ్యాప్తంగా అక్రమ సంబంధాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటి వల్ల అత్యంత దారుణ హత్యలు, ఆత్మ హత్యలు జరుగుతున్నాయి. మరికొన్న చోట్ల దాడులు జరుగుతున్నాయి. తాజాగా తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే నెపంతో.. అతని మర్మాంగాలను భార్య కోసేసింది. ఈ దారుణమైన ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో చోటు చేసుకుంది. జోగిందర్ నగర్‌కు చెందిన ఆజాద్ సింగ్, శుక్వాంత్ కౌర్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
see also..ఫిరాయింపు బ్యాచ్‌కి బంపర్ ఆఫర్.. జగన్ షాకింగ్ డిసిషన్..!
గత కొంత కాలం నుంచి ఆజాద్ సింగ్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు భార్య అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో నిన్న రాత్రి నిద్రిస్తున్న భర్తపై భార్య రాడ్‌తో దాడి చేసింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన భర్త.. మర్మాంగాలను కత్తితో కోసి.. టాయిలెట్‌లో వేసి నీళ్లు పోసింది. తీవ్ర రక్తస్రావమైన ఆజాద్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆజాద్ సింగ్ తండ్రి.. శుక్వాంత్ కౌర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
see also..వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు ..టికెట్ ఖరారు చేసిన జగన్ …!