Home / ANDHRAPRADESH / కోనేరు హంపిని అభినందించిన సీఎం జగన్..!

కోనేరు హంపిని అభినందించిన సీఎం జగన్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిని అభినందించారు. కైర్న్స్ కప్ 2020 గెలవడం ద్వారా ఆమె మరో ఘనత సాధించింది. ఈ విజయం పట్ల జగన్ ఆనందం వ్యక్తం చేసారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆయన ఆకాంక్షించారు. మహిళా గ్రాండ్ మాస్టర్‌లలోనే కాదు మొత్తం గ్రాండ్ మాస్టర్లలో అతి చిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొంది రికార్డు సృష్టించింది.