Home / Uncategorized / హీరో నిఖిల్ పెళ్లి వాయిదా

హీరో నిఖిల్ పెళ్లి వాయిదా

ప్రస్తుతం అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా ఎఫెక్టుతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో పెళ్లి వాయిదా పడింది.

యువహీరో నిఖిల్ కరోనా ఎఫెక్టుతో తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించాడు.త్వరలోనే మరో తేదిని వెల్లడిస్తానని తెలిపాడు.

డా.పల్లవి వర్మతో నిఖిల్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు.ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2,18ఫేజెస్ చిత్రాల్లో నటిస్తున్నాడు.మరోవైపు ఇప్పటికే మరో యువహీరో నితిన్ పెళ్లి కూడా కరోనా ఎఫెక్టుతో వాయిదా పడింది