జర్మనీలో ఒక మేయర్‌పై దాడి జరిగింది. శరణార్థులకు అండగా నిలుస్తున్న ఆయనపై కబాబ్ దుకాణం వద్ద ఓ వ్యక్తి దాడి చేశాడు. సమయానికి కబాబ్ దుకాణం యజమాని సాయంగా రావడంతో ఆయన ప్రాణాలు దక్కాయి. జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌కు చెందిన క్రిష్టియన్ డెమొక్రటిక్ యూనియన్ నేత, అట్లెనా మేయర్ అండ్రియాస్ హోలెస్టీన్‌పై సోమవారం సాయంత్రం దాడి జరిగింది. కబాబ్ దుకాణం వద్దకు వచ్చిన అండ్రియాస్‌ను ఓ వ్యక్తి పలుకరించి.. నువ్వు మేయర్‌వేనా అని ప్రశ్నించాడు. విదేశీ శరణార్థులకు అండగా ఆయన చేపడుతున్న విధానాలను తప్పుబడుతూ.. పొడవైన కత్తితో మేయర్ మేడపై పొడిచాడు. ఈ దాడి నుంచి కోలుకున్న మేయర్ అండ్రియాస్.. కబాబ్ దుకాణం యజమాని అబ్దుల్లా దిమిర్, అతని కుటుంబసభ్యులు సమయానికి తనకు రక్షణగా రావడం వల్లే తాను బతికి ఉన్నానని, వారే తన ప్రాణాలు కాపాడారని తెలిపారు.