హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. గత 15 రోజుల క్రితమే ఓ టీవీ నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ విషయం మరిచిపోకముందే మళ్లీ ఇప్పుడు ముగ్గురు మోడళ్ళు, దర్శకుడు, అసిస్టెంట్ దర్శకుడు దొరికిపోవడం సంచలనం కలిగిస్తోంది. ఓ ఇంట్లో వ్యబిచారం నిర్వహిస్తూ ముగ్గురు మోడళ్లు, ఓ దర్శకుడు, అసిస్టెంట్ డైరెక్టర్ పోలీసులకు పట్టుబడ్డారు. మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల వెంకటాద్రి టౌన్‌షిప్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారమందింది. దీంతో పోలీసులు ఆ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. కాగా… ఆ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మోడళ్లు, ఓ సినిమా డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌ను అదుపులోకి తీసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు అనంతరం ఘట్‌కేసర్ పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా శివారు ప్రాంతాల్లోగల టౌన్‌షిప్‌లలో ఫ్లాట్లను అద్దెకు తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
