అవును మీరు చదివింది నిజమే. రాత్రి అయితే చాలు ఓ మహిళ తన భర్త రక్తాన్ని జ్యూస్ తాగినంత ఈజీగా తాగేసింది. చివరికి తన భర్త చావుకు తనే బాధ్యురాలు అయింది. ఈ సంఘటన పశ్చమబెంగాల్ బర్బల్ సరైపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే, భర్త తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
మన దేశంలో ప్రతి నిత్యం ఏక్కడో ఓ చోట హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, దోపిడీలు వంటి చాలా సంఘటనలు జరుగుతూను ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు మాత్రం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అయితే, బెంగాల్‌లో జరిగిన ఘటన సమాచారం చదివితే మాత్రం వెన్నులో వణుకుపుట్టడం ఖాయం.
ఓ మహిళ తన భర్త రక్తం రోజూ తాగేదంట. ప్రతి రోజు రాత్రిపూట తన భర్తకు శృంగారంపట్ల ఆసక్తి లేకపోయినా.. సరే .. తానే ప్రేరేపించి మరి భర్తను శృంగారంలోకి దించిన తరువాత కసి.. కసిగా భర్త పెదాలను.. శరీరంలోని కొన్ని భాగాలను కొరుకుతూ.. దాని ద్వారా వచ్చిన రక్తాన్ని చప్పరిస్తూ మింగేసేదట. తన భర్త చాతిపై కూర్చొని..పక్కనే మంత్రించిన శూలం పెట్టుకుని భర్తకే తెలియకుండా ఈ ఘటనకు పాల్పడింది ఆ మహిళ. ఒకానొక రోజు ఈ దృశ్యాన్ని చూసిన అత్త ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది. అయితే, ఆ మహిళ కేవలం తన భర్తనే కాకుండా.. తన కుమారుడి రక్తాన్ని కూడా జ్యూస్‌లా తాగేసిందట.
ఆ మహిళ గురించి ఇరుగుపొరుగు వారు చర్చించుకంఉటూ.. ఆమెను మంత్రగత్తెగా అభివర్ణించేవారు. ఆమె వల్లే భర్త, కుమారుడు మృతి చెందాడని, ఆమె ఒక రక్తపిశాచి అని చెబుతుంటే.. మరో వైపు మాత్రం వారిద్దరూ అనిమియా వ్యాధి వల్లే చనిపోయారని చెబుతున్నారు. అయితే, తన కోడలిపై అత్త ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు రంగంలోకి దిగి ఆ మహిళ అసలు రహస్యాన్ని బట్టబయలు చేశారు. ఆమె ప్రతి రోజు నిద్రించే ప్రదేశంలో మంత్రించిన శూలం.. మనుషుల రూపంలో ఉన్న బొమ్మలు.. చేతబడిచేసే సామాగ్రిని చేసి పోలీసులు ఖంగుతిన్నారు. పోలీసుల అనుమానం నిజం కావడంతో ఆ మహిళ ఇప్పుడు పోలీసు స్టేషన్‌లో ఊసలు లెక్కపెడుతోంది.