లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన గజల్ శ్రీనివాస్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. శ్రీనివాస్ ను ఇవాళ ఉదయం అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, శ్రీనివాస్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టులో గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై వాదనలు జరుగుతున్నాయి. శ్రీనివాస్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు పిటిషన్ దాఖలు చేస్తామని పంజాగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్ తెలిపారు.
లైంగిక వేధింపుల కేసులో పక్కా ఆధారాలతోనే గజల్ శ్రీనివాస్‌ను అరెస్టు చేసినట్లు పంజాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆలయవాణి వెబ్ రేడియోలో పని చేస్తున్న కుమారి అనే యువతి.. గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆధారాలతో సహా డిసెంబర్ చివరి వారంలో తమకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. వేధింపులకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఆలయవాణి వెబ్ రేడియో ఆఫీసులోనే కుమారిపై శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు.