తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ భర్త ,కాంగ్రెస్ నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. మిర్చి బండి దగ్గర జరిగిన చిన్న గొడవే శ్రీనివాస్ హత్యకు దారితీసిందన్నారు. ఈ హత్య కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రాంబాబు, మల్లేష్, శరత్‌లను ప్రధాన నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.
