తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి.. మోస్తారు వర్షాలు కురుస్తున్న తరుణంలో.. రాజకీయ నాయకులకు మరింత హీటెక్కించేలా ఆరా మస్తాన్ టీమ్ ఇటీవల ఏపీలో చేసిన సర్వేను విడుదల చేసింది. ఇప్పుడు ఆ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. అయితే, ఆరా మస్తాన్ టీమ్ చేసిన ఆంధ్ర పొలిటికల్ సర్వేలో ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా పలు పార్టీలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, అలాగే ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీల వ్యవహార శైలితోపాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై ప్రజల్లో ప్రస్తుతం ఉన్న అభిప్రాయాలేంటి..? అలాగే, త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపనున్నారు..? అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని మరీ ఆరా మస్తాన్ టీమ్ సర్వే ఓ నివేదికను రూపొందించింది.
ఆరా మస్తాన్ చేసిన ఈ సర్వేలో టీడీపీ ఓటు బ్యాంకు 20 శాతం తగ్గిపోయింది. దీనికి గల కారణాలను కూడా సర్వే సంస్థ వెల్లడిచింది. చంద్రబాబు సర్కార్ విధానాలు, కుల రాజకీయమేనని ఆ పత్రిక వెల్లడించింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, అలాగే, రైతు రుణమాఫీ 84 వేల కోట్లు ఉంటే.. ఇప్పటి వరకు 11వేల కోట్లను మాత్రమే చంద్రబాబు మాఫీ చేశారని చెప్పుకొచ్చింది.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక కులం ఆధిపత్యం బాగా పెరిగిందని ఆ సర్వే పేర్కొంది. దీంతో సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇది చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేక పవనాలు వీచేలా చేసిందని సర్వేలో తేలింది. ఈ సర్వేపై స్పందించిన ఓ టీడీపీ మంత్రి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ కులం ఆధిపత్యం పెరగడం వాస్తవమేనని ఒప్పుకున్నారు కూడా అంటూ ఆ సర్వే నివేదిక పేర్కొంది.
అయితే, ఆరా మస్తాన్ టీమ్ సర్వే ప్రకారం జిల్లాల వారీగా ఏ పార్టీ ఎన్నిసీట్లు గెలుస్తుందంటే..!!
కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 9
టీడీపీ : 1
జనసేన :0
కాంగ్రెస్ : 0
చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 8
టీడీపీ : 5
జనసేన :0
కాంగ్రెస్ : 0
అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 12
టీడీపీ : 2
జనసేన :0
కాంగ్రెస్ : 0
కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 8
టీడీపీ : 6
జనసేన :0
కాంగ్రెస్ : 0
నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 7
టీడీపీ : 3
జనసేన :0
కాంగ్రెస్ : 0
గుంటూరు 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో
వైసీపీ : 13
టీడీపీ : 4
జనసేన :0
కాంగ్రెస్ : 0
కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అదులో
వైసీపీ : 11
టీడీపీ : 5
జనసేన :0
కాంగ్రెస్ : 0
పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో..
వైసీపీ : 10
టీడీపీ : 3
జనసేన :2
కాంగ్రెస్ : 0
తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో..
వైసీపీ : 13
టీడీపీ : 4
జనసేన :2
కాంగ్రెస్ : 0
విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో..
వైసీపీ : 11
టీడీపీ : 4
జనసేన :0
కాంగ్రెస్ : 0
విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో..
వైసీపీ : 7
టీడీపీ : 2
జనసేన :0
కాంగ్రెస్ : 0
శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో..
వైసీపీ : 7
టీడీపీ : 2
జనసేన :1
కాంగ్రెస్ : 0
ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో..
వైసీపీ : 9
టీడీపీ : 2
జనసేన :1
కాంగ్రెస్ : 0
ఇదిలా ఉండగా, 2014 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి ఏపీ ప్రజలను అమలు కాని హామీలను ఆశగా చూపి అధికారం చేపట్టాయని, వైసీపీతో పోల్చితే ఒకటన్నరశాతం మాత్రమే ఓట్లు తేడా వచ్చిన విషయం ఆరా మస్తాన్ టీమ్ సర్వే మరో సారి పేర్కొంది. ఈ సారి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. వైసీపీకి 70 శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు ఆ సర్వే పేర్కొంది. ఇక్కడ మరో విశేషమేంటంటే.. జనసేనకు ఆరు అసెంబ్లీ సీట్లు రాగా, కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క సీటు కూడా గెలవకపోవడం గమనార్హం.