గత మూడురోజుల క్రితం అధికార తెలుగుదేశం పార్టీ నేతల నేతల ర్యాలీకి అనుమతిచ్చిన గుంటూరు పోలీసులు ఇవాళ వైసీపీ నేతల పర్యటనను నిరంకుశంగా అడ్డుకున్నారు. ఆపార్టీ గురజాల ఇన్‌చార్జ్ కాసు మహేష్‌రెడ్డి ని అర్థరాత్రి 12గంటలనుంచి హౌస్ అరెస్టులు చేసారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నాయని, ఎమ్మెల్యే యరపతినేని కన్నుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరిగిందని రిపోర్టు వచ్చింది.. ఈక్రమంలో ఆప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళలడానికి వైసీపీ బృందం అనుమతి కోరగా తిరస్కరించారరు. యరపతినేని అరాచకాలకు అమాయకులపై కేసులు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కాసు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే మరో ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని గృహ నిర్భందం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న పార్టీ నాయకులను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. జిల్లా మొత్తం పోలీస్ నిర్భందంలో ఉందని, జిల్లాలో 28 లక్షల టన్నుల తెల్లరాయిని, 5వేలకోట్ల రాయిని టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలకు పాల్పడటానికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కారణమని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం వాదన, ప్రజల వాదన వినాల్సిన అవసరం ఉందన్నారు. నరసరావుపేటలో నడిరోడ్డుపై కోడెల కుమారుడు శివరామకృష్ణ స్టేజీ వేసి ఉదయం 10గంటల నుంచి ప్రజలను, ట్రాఫిక్‌ను ఇబ్బంది పెట్టారన్నారు. అప్పుడు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు.