Home / NATIONAL / దేశం గర్వించదగిన మహోన్నత నాయకుడు అటల్ బిహారీ వాజ్‌‌పేయి జయంతి నేడు..!

దేశం గర్వించదగిన మహోన్నత నాయకుడు అటల్ బిహారీ వాజ్‌‌పేయి జయంతి నేడు..!

అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25,1924 లో గ్వాలియర్ లో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి కృష్ణాదేవి, తండ్రి కృష్ణబిహారీ వాజపేయి మరియు తాత పండిట్ శ్యాంలాల్ వాజపేయి. ఆయన తండ్రి కృష్ణబిహారీ వాజపేయి ఉపాధ్యాయుడు మరియు కవి. వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశాడు. గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో చేరి హిందీ, ఆంగ్లము, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనాడు. కాన్పూరు లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాలనుండి రాజనీతిశాస్త్రంలో ఎం.ఎ పట్టాను పొందాడు. ఎం.ఎ డిగ్రీని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైయ్యారు వాజపేయి జీవితాంతం బ్రహ్మచారిగానే జీవించాడు.

 

 

ఇక రాజకీయ విషయానికి వస్తే 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో, ఆయన తన అన్న ప్రేమ్‌తో కలిసి 23 రోజుల పాటు అరెస్టయిన సందర్భంలో వాజపేయికి తొలిసారిగా రాజకీయాలతో పరిచయమేర్పడింది.  1954 లో కాశ్మీరులో కాశ్మీరేతర భారతీయ సందర్శకులను చిన్నచూపు చూస్తున్నారన్న విషయమై నిరసన ప్రకటిస్తూ ముఖర్జీ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించినప్పుడు, వాజపేయి ఆయన వెంటే ఉన్నాడు. ముఖర్జీ ఈ నిరాహారదీక్షా సమయంలోనే కాశ్మీర్ జైలులో మరణించాడు. 1957లో వాజపేయి బల్రామ్‌ఫూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన వాగ్ధాటి మూలంగా, అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ఏదో ఒకరోజు వాజపేయి దేశ ప్రధాని అవుతాడని ఊహించాడు.

 

 

1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాడు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో సారి ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించాడు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నాడు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నాడు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం మార్చి మార్చ్ 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది.  ఆయన పుట్టినరోజునాడు అనగా  సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.  2015 మార్చి 27 న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, వాజపేయికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేసాడు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజపేయికి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే వాజపేయి నివాసానికి తరలి వెళ్ళాడు. ఈయన ఆగష్టు 16, 2018 న మరణించారు. దేశం గర్వించదగిన మహోన్నత నాయకుడు అటల్ బిహారీ వాజ్‌‌పేయి జయంతి సందర్భంగా ఒక్కసారి ఆయనను స్మరించుకుందాం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat