శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని నాయుడుపేట పరిసర ప్రాంతాలలో కొందరు ముఠా గా ఏర్పడి దారిదోపిడీలకు పాల్పడ్డాన్ని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకొని అరెస్ట్ చేసారు. నాయుడుపేట పట్టణం లోని ఆకుతోట వీధి కి చెందిన నలుగురు ముఠాగా ఏర్పడి సంక్రాతి ఖర్చులకోసం దారిదోపిడీలకు పాల్పడుతూ దొరికిపోయారు. నలుగురి లో ఒకరు చీరకట్టుకొని మహిళా వేషం లో మోటారుసైకిళ్లను ఆపడం, ఆగిన వెంటనే అందరు కలిసి దారిదోపిడీల పాల్పడటం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే వెళ్లి వారిని పట్టుకున్నారు. నిందితుల్లో వేంకటగిరి శ్రీరామ్,అమాస్య వెంకటరమణ అమాస్య రాజా,కంపా వెంకటేశ్వర్లు ఉన్నారు. వారి వద్ద నుండి దారిదోపిడీల కోసం వదిన కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
