అగ్రరాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకతో అహ్మదాబాద్ మొత్తం ఒక్కసారిగా కలకల్లాడింది. కుటుంబ సమేతంగా భారత్ లో అడుగుపెట్టిన ట్రంప్ కు భారత ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. అనంతరం అమెరికా, భారత అధికారులకు పరిచయం చేసారు. ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో సబర్మతి ఆశ్రమానికి వెళ్ళారు. మరోపక్క లక్షలాది మంది ఆయనకు స్వాగతం పలికారు. ఆ తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద మొతెరా క్రికెట్ స్టేడియం కు చేరుకొని అది ప్రారంభించారు.ట్రంప్ రాకతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది.
