Home / Uncategorized / అన్నార్తులకు అండగా..

అన్నార్తులకు అండగా..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గుజరాతీ, మర్యాడీ, వైశ్య సేవా సంస్థలు తమ వంతుగా సామాజిక ధృక్పథాన్ని చాటారు. సికింద్రాబాద్‌లోని గుజరాతీ సేవా మండల్‌, కాచిగూడలోని వైశ్య హాస్టల్‌, బేగంబజార్‌లోని మర్వాడీ సమాజ్‌, లక్డీకపూల్‌లోని వాసవి సేవా కేంద్రం ఒక్కొక్కరై ఐదు వేల మందికి చొప్పున రోజుకు ఇరవై వేల మంది నిరుపేదలకు వచ్చే నెల రోజుల పాటు భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించారు.

గుజరాతీ సేవా మండల్‌ అధ్యక్షులు ఘనశ్వామ్‌ పటేల్‌ ఆధ్వర్యంలో బుధవారం ఐదు వేల మందికి ఐదు వందల గ్రాముల భోజనం ప్యాకెట్లను, మంచినీళ్ల ప్యాకెట్లను నిరుపేదలకు అందించారు. కాచిగూడలోని వైశ్యహాస్టల్‌ అధ్యక్షులు వేలూరు రవీంద్ర గుప్త , మర్వాడీ సమాజ్‌ అధ్యక్షులు గోవింద్‌ రాఠీ, వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు కే. రాజశేఖర్‌ గుప్త, బొగ్గారపు దయానంద్‌ ఆధ్వర్యంలో ఐదు వేల మందికి భోజన ప్యాకెట్లు, మంచినీళ్ల ప్యాకెట్లను సిద్దం చేసి రోజూ జీహెచ్‌ఎంసీ అధికారులకు అందించి పంపిణీ జరిగే ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు.

నెల రోజుల పాటు జరిగే ఈ బృహత్తర పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేతుల మీదుగా ఆహారం, మ ంచినీళ్ల ప్యాకెట్లను అందజేశారు. సీఎం కేసీఆర్‌ స్పూర్తితో నిరుపేదలకు తమ వంతు సాయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈ సందర్భంగా కోలేటి దామోదర్‌ చెప్పారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat