Home / Uncategorized / కరోనా కట్టడిలోనూ తెలంగాణ ముందు

కరోనా కట్టడిలోనూ తెలంగాణ ముందు

అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో ముందున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోనూ ముందుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరిలో నిరుపేదలకు మంత్రి నేడు రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కరోనా వైరస్‌ వ్యాప్తి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను అందునా నిరుపేదలను ఆదుకోవాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్‌ పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారన్నారు.

వ్యక్తికి 12 కిలోల చొప్పున అదేవిధంగా రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 1500 అందజేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ కుటుంబ పెద్దలా ఆలోచిస్తున్నారన్నారు. ప్రపంచం సహా దేశంలో ఆర్థికమాంద్యం తాండవిస్తున్న వేళ కూడా రాష్ట్రంలో సంక్షేమాన్ని ఆపలేదన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఉచిత బియ్యం, ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. ప్రజలు చేయాల్సిందిల్లా లాక్‌డౌన్‌ను పాటిస్తూ ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండా ఉండటమేనని పేర్కొన్నారు.