Home / NATIONAL / ఇంట్రెస్టింగ్‌గా ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్‌..ఎక్క‌డ ఏ పార్టీ?

ఇంట్రెస్టింగ్‌గా ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్‌..ఎక్క‌డ ఏ పార్టీ?

దిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల సంగ్రామం ముగిసింది. నేటితో చివ‌రి ద‌శ పోలింగ్ పూర్త‌యింది. మార్చి 10న ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. పిబ్ర‌వ‌రి 10న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్‌, మ‌ణిపుర్‌, గోవా రాష్ట్రాల్లో ప్రారంభ‌మైన ఎన్నిక‌లు నేటితో ముగిశాయి. ఈ నేప‌థ్యంలో కొన్ని సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌ను ప్ర‌క‌టించాయి. మ్యాట్రిజ్‌,పీమార్క్‌, టైమ్స్ నౌ-వీటో,పోల్‌స్ట్రాట్‌, ఆత్మ‌సాక్షి, సీఎన్ఎన్-న్యూస్ 18, జ‌న్‌కీ బాత్‌-ఇండియా న్యూస్ త‌దిత‌ర సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్‌ను వెల్ల‌డించాయి.

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్లీ బీజేపీ ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని మెజార్టీ సంస్థ‌లు వెల్ల‌డించాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ – ఆప్ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో పోటీ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఎక్కువ సంస్థ‌లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. ఉత్త‌రాఖండ్‌, గోవాలో మాత్రం బీజేపీ -కాంగ్రెస్ మ‌ధ్య‌ హోరాహొరీ పోరు జ‌రిగిన‌ట్లు ఎగ్జిట్ పోల్స్‌తో తెలుస్తోంది. ఆ రెండు చోట్ల ఏ పార్టీ గెలిచినా త‌క్కువ స్థానాల వ్య‌త్యాస‌మే ఉండేటట్లు క‌నిపిస్తోంది. మ‌ణిపూర్‌లో ఎడ్జ్ బీజేపీ వైపు ఉన్న‌ట్లు వెల్ల‌డ‌వుతోంది.

రాష్ట్రాల వారీగా ఎగ్జిట్ పోల్స్ ఇవీ..

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్

సీఎన్ఎన్‌-న్యూస్ 18: బీజేపీ కూట‌మికి 240, స‌మాజ్‌వాదీ కూట‌మికి 140+, బీఎస్పీ 17, కాంగ్రెస్ 0, ఇత‌రులు 6
మ్యాట్రిజ్‌: బీజేపీ కూట‌మికి 262-277,సమాజ్‌వాదీ కూట‌మి 119-134; బీఎస్పీ 7-15, కాంగ్రెస్‌ 3-8
పీ-మార్క్‌: బీజేపీ కూట‌మికి 225-255, సమాజ్‌వాదీ కూట‌మి 130-155, బీఎస్పీ 12-22, కాంగ్రెస్‌ 2-6, ఇతరులు 0-4ఆత్మసాక్షి: బీజేపీ కూట‌మికి 138-140, సమాజ్‌వాదీ+ 235- 240, బీఎస్పీ 19-23, కాంగ్రెస్‌ 12-16, ఇతరులు 1-2

పంజాబ్‌

పీ-మార్క్: ఆప్ 62-70, కాంగ్రెస్ 23-31, అకాలీదళ్‌ 16-24, భాజపా 1-3

ఆత్మసాక్షి: ఆప్ 34-38, కాంగ్రెస్ 58-61, అకాలీదళ్‌ 18-21, భాజపా 4-5

గోవా

సీఎన్‌ఎక్స్‌: బీజేపీ 11-16, కాంగ్రెస్‌ 11-17, ఆప్‌ 0-2, ఇతరులు 5-7

జన్‌కీ బాత్‌- ఇండియా న్యూస్‌: బీజేపీ 13-19, కాంగ్రెస్‌ 10-14, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ 07-08, ఎన్‌పీఎఫ్‌ 5-7, జేడీయూ 5-7 స్థానాలు

ఉత్తరాఖండ్‌

టైమ్స్‌ నౌ-వీటో బీజేపీ 37, కాంగ్రెస్ 31, ఆప్‌-1, ఇతరులు 1

మణిపూర్‌

జన్‌కీ బాత్‌- ఇండియా న్యూస్ బీజేపీ 23-25, కాంగ్రెస్‌ 10-14, ఎన్‌పీపీ 07-08, ఎన్‌పీఎఫ్‌ 05-07, జేడీయూ 5-7

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat