Breaking News
Home / CRIME / ఐ లవ్ యు అంటూ.. దొంగకు ఫోన్ చేసిన లేడీ పోలీస్…చివరికి..!!

ఐ లవ్ యు అంటూ.. దొంగకు ఫోన్ చేసిన లేడీ పోలీస్…చివరికి..!!

అవును మీరు చ‌దివింది నిజ‌మే. ఓ దొంగ‌కు లేడీ పోలీస్ ఐ ల‌వ్ యూ చెప్పింది. ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగింది. ఎలా జ‌రిగింది. చివ‌రికి వారిద్ద‌రూ క‌లిశారా..? లేదా..? అన్న‌ది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చ‌ద‌వాల్సిందే.

ఓ వ్య‌క్తి మ‌రో వ్య‌క్తి ఫోన్ కొట్టేశాడు. ఫోన్ కొట్టేశాడు క‌దా..! దాన్ని అమ్మేసుకోవ్చు క‌దా..! కానీ ఆ దొంగ అలా చేయ‌లేదు. ఆ ఫోన్‌లో సిమ్‌ను తీసేసి త‌న సిమ్‌ను వేసుకుని త‌న ఫ్రెండ్స్‌కు ఫోన్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఎవ‌రు ఫోన్ చేసినా.. అక్క‌డున్నా..ఇక్క‌డున్నా అంటూ చెప్ప‌సాగాడు. అయితే.. అనుకోకుండా ఓ రోజు ఓ మ‌హిళ ఫోన్ చేసింది. దీంతో ఊహాలోకానికి వెళ్లిన ఆ దొంగ.. ఆ మ‌హిళ‌తో ఎక్కువ సేపు సంభాషించ‌డం మొద‌లు పెట్టాడు. ఇలా కొన్ని రోజులు గ‌డిచాక ఆ మ‌హిళ ఆ దొంగ‌కు ఐ ల‌వ్ యూ కూడా చెప్పేసింది. దీంతో ఇద్ద‌రూ క‌లిసేందుకు స్పాట్‌ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. స్పాట్‌కు చేరుకున్న ఆ దొంగ‌కు స‌ర్‌ప్రైజ్‌గా ఆ మ‌హిళ క‌నిపించింది. ఆమెతోపాటు మ‌రో ఇద్ద‌రు మ‌హిళా పోలీసులు కూడా క‌నిపించారు.

దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆ మ‌హిళ ఎవ‌రో కాదు మ‌ధుబాల (ఐఏఎస్‌) దీంతో ఒక్క‌సారిగా ఆ దొంగ ఖంగుతిన్నాడు. ఆ దొంగకు ఒక్క‌సారిగా ప్లాష్‌బ్యాగ్ గుర్తొచ్చింది. తాను దొంగ‌త‌నం చేసిన ఫోన్ ఒక బీజేపీ నేత‌ద‌ని, దాని ఐఎంఏ ఆధారంగా పోలీసులు త‌న‌ను ప‌ట్టుకోగ‌లిగార‌ని గుర్తించాడు. ఇప్పుడా దొంగ ఊస‌లు లెక్కెడుతున్నాడు. ప్రేమ పేరుతో ఓ దొంగ‌ను మోసం చేసిన ఆ మ‌హిళా పోలీసుపై నెట్టింట్లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.