Home / CRIME / పోలీసులనే వ్యభిచారానికి ఆహ్వానించిన మహిళ..!

పోలీసులనే వ్యభిచారానికి ఆహ్వానించిన మహిళ..!

తమిళనాడులోని మదురైలో పోలీసులను వ్యభిచారానికి ఆహ్వానించిన మహిళతో సహా నలుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మదురైలో కిడ్నాప్‌ల నిరోదక విభాగం పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు తిరుపతి. ఇతనికి గురువారం సెల్‌ఫోన్‌లో ఒక ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. మహిళలతో జల్సాగా గడపాలనుకుంటే ఈ కింది నెంబర్‌కు సంప్రదించాలని అందులో పేర్కొన్నారు. ఈ నెంబర్‌ ఆధారంగా తిరుపతి అక్కడికి వెళ్లగా సుబ్రమణి అనే వ్యక్తి తనను పరిచయం చేసుకున్నాడు.

అక్కడ బేరసారాలు జరిగిన తర్వాత తిరుపతి వద్ద అక్కడున్న ముఠా నగదు లాక్కుని ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. తర్వాత ఒక మహిళను అతనితో పాటు ఒక గదికి పంపారు. ఈ లోపున తిరుపతి మరుగుదొడ్డికి వెళ్లి వస్తానని చెప్పి, అక్కడి నుంచి పోలీసులకు సమాచారం తెలిపారు. దీంతో హుటాహుటిన అక్కడికి వచ్చిన పోలీసులు వ్యభిచారం జరుపుతున్న అయ్యనార్, శేఖర్, మనోజ్‌ కుమార్‌తో సహా నందిని అనే మహిళను అరెస్టు చేశారు.