భారతదేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అందరు అనుకున్నట్టుగానే ఈసారి కూడా ఆమ్ ఆద్మి పార్టీ ఘన విజయం సాధించింది. కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటికే ఆమ్ ఆద్మి పార్టీకి 57 సీట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక బీజేపీ 13 వద్దే ఉంది. ఇంక కాంగ్రెస్ పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అంతకుముందు మొత్తం 70స్థానాలకు గాను ఆమ్ ఆద్మి పార్టీ 67సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు కూడా అధికారం సొంతం చేసుకుంది. తద్వారా అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ సీఎం అవ్వబోతున్నాడు. ఈ విజయం వెనుకు ఉన్న ముఖ్య కారణాలు ఆమె అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే అని చెప్పాలి.