Home / CRIME / హైదరాబాద్‌కు లారీల్లో భారీగా ఒంటె మాంసం..ఎక్కడి నుండి తెలుసా…?

హైదరాబాద్‌కు లారీల్లో భారీగా ఒంటె మాంసం..ఎక్కడి నుండి తెలుసా…?

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఒంటె మాంసాన్ని తరలిస్తున్న లారీలను స్థానికుల సహకారంతో పోలీసులు అడ్డుకున్నారు. మునుగోడు మండలం ఊకొండి గ్రామ శివారులో ఓ రైతు పొలం దగ్గర గుర్తు తెలియని దుండగులు ఒంటెలను వధించారు. నాలుగు లారీల్లో 30 ఒంటెలను ఇటీవల తీసుకొచ్చారు. అనంతరం వాటిని బుధవారం అర్ధరాత్రి కోసి 4 డీసీఎం వ్యాన్లలో 20 క్వింటాళ్లకు పైగా ఒంటె మాంసాన్ని హైదరాబాద్‌కు లారీల్లో తరలించడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మాంసం తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. అనంతరం ఈ మాంసం వ్యవహారంతో సంబంధం ఉన్న 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.