వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర విజయవాడ కు చేరుకోనుంది.ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించనుంది. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 136వ రోజుకు చేరుకుంది. జగన్ ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు.
ఈ క్రమమలో ఇవాళ భారత రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు యన ట్వీట్ చేశారు. దళితులు, మహిళలు, కార్మికుల కోసం పోరాడిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని ఈ సందర్భంగా కొనియాడారు.అంబేద్కర్ ఆశయాలు నేటికీ మనందరికీ స్ఫూర్తిదాయమని అన్నారు.
Tributes to Babasaheb Ambedkargaru on his Jayanthi, champion for the cause of Dalits, women and labour. His ideals continue to inspire us to this day.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2018