Home / 18+ / కేరళలో పర్యటించనున్న రాహుల్ గాంధీ..

కేరళలో పర్యటించనున్న రాహుల్ గాంధీ..

ఈ నెల 28, 29 తేదీల్లో కేరళలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుండి కేరళ రాజధాని తిరువనంతపురానికి చేరుకుంటారు. అనంతరం చెంగనూర్‌, అలప్పూజ, అంగమాళిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు కొచ్చి చేరుకొని అలువా, పరవూర్‌, చాలక్కూడీ ప్రాంతాల్లో పర్యటిస్తారని సమాచారం. రెండవ రోజు అనగా బుధవారం వయనాద్‌ జిల్ల్లాలో పర్యటించి, మధ్యాహ్నం 1.15 గంటలకు కోజికోడ్‌ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి ఢిల్లీకి ప్రయాణించనున్నారు.