నేటి సమాజంలో వావి వరసలు మరిచి అత్యంతా దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ మద్య రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా ఏమి తెలియని అమయాకపు ఆడపిల్లలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతన్నాయి. అయితే ఆడపిల్లలకు బయటి సమాజంలోనే కాదు ఇంట్లోనూ రక్షణ కరువవుతున్న పరిస్థితి. కొంతమంది కామాంధులు కన్నబిడ్డలనే కాటేస్తున్నారు. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కన్న కూతురు అన్న కనీసం మానవత్వం లేకుండా ఓ కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన కుమారస్వామి కారు డ్రైవర్గా పనిచేస్తూ హన్మకొండలోని కెఎల్ఎన్ రెడ్డి కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కుమారస్వామి గత మూడు నెలలుగా తన చిన్న కూతురు(14)పై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల అతని పెద్ద కూతురు కళ్లారా ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయింది. వెంటనే తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుమారస్వామి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
